1. పురాణాల్లో ‘కాకవర్ణుడు’గా పేర్కొన్న మగధ సామ్రాజ్య చక్రవర్తి?
Answer: కాలాశోకుడు
2. గ్రీకు రచనల్లో ‘అగ్రమెస్’గా పేర్కొన్న మగధ సామ్రాజ్య చక్రవర్తి?
Answer: ధన నందుడు
3. నంద రాజు భార్య ముర అనే శూద్ర స్త్రీకి మౌర్య చంద్రగుప్తుడు జన్మించాడని వివరించే గ్రంథం?
Answer: విష్ణు పురాణం
4. భారత యుద్ధతంత్రానికి మహాశిలకంఠిక, రథముసలం వంటి నూతన ఆయుధాలను పరిచయం చేసిన మగధ సామ్రాజ్య చక్రవర్తి?
Answer:అజాతశత్రువు
5. భారతదేశంపై దండయాత్ర చేసిన మొట్టమొదటి విదేశీయులు?
Answer: పర్షియన్లు
6. అవంతి రాజైన చండప్రద్యోతనుడికి సోకిన కామెర్ల వ్యాధిని తన ఆస్థాన రాజవైద్యుడైన జీవకుడి చేత చికిత్స చేయించి తన మద్దతుదారుడిగా మార్చుకున్న మగధ రాజ్య చక్రవర్తి?
Answer: బింబిసారుడు
7.భాసుడు రాసిన స్వప్నవాసవదత్త నాటకంలోని కథానాయకుడు?
Answer: వత్సరాజైన ఉదయనుడు
8. పూర్వకాలంలో మాలినీ అని కూడా పిలువబడిన ప్రసిద్ధ వ్యాపార కేంద్రంగా విలసిల్లిన నగరం?
Answer: చంపానగరం
9. చంద్రగుప్త మౌర్యుడు నిమ్నకులస్థుడు, శూద్రుడు, వేశ్యాక్షురకుల సంతతికి చెందినవాడని పేర్కొన్న గ్రంథం?
Answer: పరిశిష్ఠపర్వం
10. మౌర్య చంద్రగుప్తుడి కాలంలో గిర్నార్ వద్ద సుదర్శనతటాకంను నిర్మించిన సౌరాష్ట్ర పాలకుడు?
Answer: పుష్యగుప్తుడు