1. మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ బారుత్ బౌద్ధస్థూపం ఏ వంశ రాజుల కాలంలో నిర్మించారు?
Answer: శుంగ వంశం
2. భారతదేశ భూభాగంపై మొదటిసారిగా విదేశీ ఆధిపత్యాన్ని స్థాపించినవారు ఎవరు?
Answer: యవనులు
3. పుష్యమిత్ర శుంగుడు బౌద్ధులను అణచివేసినట్లు తెలియజేసిన గ్రంథం ఏది?
Answer: దివ్యవదన
4. ఖారవేలుడు ఎవరు నిర్మించిన పురాతన కాలువను పొడిగించాడు?
Answer:మహా పద్మనందుడు
5. చంద్రగుప్త మౌర్యుని సామంతరాజు నిర్మించిన సుదర్శన తటాకం ఆనకట్టను రుద్ర దమనుడు బాగు చేయించాడు. ఆ ఆనకట్ట ఎక్కడ కలదు?
Answer: కథియావాడ్
6. కనిష్కుడు పోషించిన బౌద్ధమత శాఖ ఏది?
Answer: మహాయానం
7.మహాభాష్యం దేన్ని వ్యాఖ్యానిస్తుంది?
Answer: పాణిని అష్టాధ్యాయి
8. కళింగ ఖారవేలుడు వేయించిన శాసనం ఏది?
Answer: హాథిగుంఫా శాసనం
9. పురాణాల్లో ‘దర్శకుడు’గా పేరొందిన మగధ సామ్రాజ్య చక్రవర్తి?
Answer: నాగదాసకుడు
10. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజ వంశాల వరుస క్రమ0
Answer: హర్యంక-శిశునాగ-నంద-మౌర్య-శుంగ వంశాలు