ప్రాచీన భారతదేశ చరిత్ర - 4

1. ఒడిశాలోని ఉదయగిరి, ఖండగిరి/స్కంధగిరి వద్ద జైన క్షేత్రాలు నిర్మించిన రాజు?

Answer: ఖారవేలుడు

 

2. పంచవత్రాల్లో ‘అపరిగ్రహం’ అంటే ఏమిటి?

Answer: అవసరానికి మించి ఆస్తి కలిగి ఉండకూడదు

 

3. జైనమత మొదటి సమావేశానికి అధ్యక్షుడు?

Answer: స్థూలబాహు

 

4. చార్వక మతస్థాపకుడు?

Answer:అజిత కేశకంబలి

 

5.  జైనమత గ్రంథాల ప్రకారం 24 మంది తీర్థంకరుల కులం?

Answer: క్షత్రియులు  

 

6. సల్లేఖన వ్రతం ఏ మతానికి చెందింది?

Answer: జైన

 

7. జైన మతస్థులు వాసుదేవుడికి దగ్గరి చుట్టంగా ఎవరిని భావిస్తారు?

Answer: పార్శ్వనాథుడు  

 

8. గౌతమ బుద్ధుడు మొదటిసారిగా బోధన చేసిన ప్రాంతం?

Answer: సారనాథ్‌ - మృగదావనం

 

9. శుద్ధోదనుడు, మాయాదేవిలకు జన్మించిన బాలుడు (సిద్ధార్థుడు) గొప్పయోగి అవుతాడు’ అని చెప్పిన జోతిష్యుడు

Answer:  అసిత

 

10. బౌద్ధమతంలో బోధనలు ప్రధానంగా ఏ భాషలో ఉన్నాయి? 

Answer:   పాళి