ప్రాచీన భారతదేశ చరిత్ర - 8

1. ‘స్థవిరవళి చరిత్ర’ అనే గ్రంథాన్ని రచించింది?

Answer: హేమచంద్ర సూరి

 

2. వర్ధమాన మహావీరుని బిరుదు ‘అరిహంత్‌’ అర్థం?

Answer: మోక్షాన్ని సాధించేవాడు

 

3. పురుషదనియ అంటే ప్రజల చేత ప్రేమించబడేవాడు అని అర్థం. ఈ బిరుదు కలిగిన జైనమత తీర్థంకరుడు?

Answer: వర్ధమాన మహావీరుడు

 

4. ‘త్రిషష్టి శలాక చరిత్ర’, ‘అభిదాస చరిత్ర’ అనే జైనమత గ్రంథాలను రాసింది ఎవరు?

Answer:హేమచంద్ర సూరి

 

5. ‘శాద్వాద చలసింహ’ అనే బిరుదు కలిగిన జైనమత కవి?

Answer: సోమదేవ సూరి

 

6. రుగ్వేద కాలంలో ‘హవ్యవాహనుడు’ అంటే?

Answer: అగ్ని

 

7.వైదిక గ్రంథాల్లో ‘వృహి’ అని దేన్ని పిలిచేవారు?

Answer: వరి

 

8. తొలి వేద కాలంలో పేర్కొన్న వ్రాతం, గ్రామం, గణం, సార్థం అనేవి?

Answer: తెగల పేర్లు 

 

9. ‘గాంధార శిల్పకళ’ ఎవరి కాలంలో వృద్ధి చెందింది?

Answer:   కనిష్కుడు

 

10. హెలియోడోరస్‌ (గ్రీకు రాయబారి) బేస్‌నగర్‌లో ఏ స్తంభాన్ని ప్రతిష్ఠించాడు?

Answer:   గరుడ స్తంభం